ప: దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్
తన మహాప్రేమచేత-క్రీస్తుతో కూడా బ్రతికించెన్
అ.ప: ఆ ప్రేమ మారనిది-శాశ్వతమైనది మమ్ము ఏడబాయనిది-వాడబారనిది
1. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయ
జగత్తు పునాదికి ముందే మనల రక్షించనేంచే
తన స్వాస్థ ్యముగా నుండుటకై ముందుగా ఏర్పరచెన్
2. దాసులమైన మనలను-ధనవంతులుచేయ
దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా
తన ప్రజలనుగా స్వీకరించి-మహిమకై ఏర్పరచెన్
3. అవిధేయులమైన మనలను-విధేయులుగా చేయా
సిలువ మరణము వరకు-విధేయత చూపెన్
మనలను పరమున చేర్చుటకు-మార్గము ఏర్పరచెన్