416
ప:లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసినా
మేలులు మేలులను లెక్క పెట్టలేనయ్యా
వందనాలు యేసు వందనాలు
వందనాలు యేసు వందనాలు
1.ఘోరపాపినై నేనుండగా`
చేరదీశావు నను చేర్చుకొన్నావు
నీ బిడ్డగా మార్చుకొన్నావు`
సొంత బిడ్డగా చేసుకొన్నావు
2.ఒంటరినయ్యా ఓదార్పులేదయ్యా`
నీ ఆత్మ చేత నన్ను ఆదరించయ్యా
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చుయేసయ్యా
3.కన్నీటితో నిండిన నా బ్రతుకులో
నిట్టూర్పులే నాకు మిగిలాయయ్యా
నన్ను లేవనెత్తి జీవింపజేసి
నీ మహిమ కొరకు వాడుకొనుమయా