పాట`312
ప: ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపెనిను నా దోషమే గదా ॥ఆహా॥
1. ‘‘వీరలను క్షమించు తండ్రి నేరమెమియున్’’
కోరితిటుల నిన్ను జంపు క్రూరజనులకై (లూకా 23:34) ॥ఆహా॥
‘‘నీవు నాతో బరదైసున నేడే యుందువు’’ పావనుండ
యిట్లు బలికి పాపిగాచితి (లూకా 23:43) ॥ఆహా॥
ప: ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపెనిను నా దోషమే గదా ॥ఆహా॥
3. ‘‘అమ్మా నీ సుతుడ’’ టంచు మరి యమ్మతో బలికి
క్రమ్మర ‘‘నీ జనని’’ యంచు గర్తనుడివితి (యెహా 19:26) ॥ఆహా॥
ప: ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపెనిను నా దోషమే గదా ॥ఆహా॥
4. ‘‘నా దేవా దేవా ఏమి విడనాడితివి’’ వనుచు శ్రీదేవసుత
పలికితివి శ్రమ చెప్పశక్యమా (మత్తయి 27:46) ॥ఆహా॥
ప: ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపెనిను నా దోషమే గదా ॥ఆహా॥
5. ‘‘దప్పిగొనుచున్నాన’’ టంచు జెప్పితివి గదా
యిప్పగిదిని బాధనొంద నేమి నీకుహా (యెహా 19:28) ॥ఆహా॥
ప: ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపెనిను నా దోషమే గదా ॥ఆహా॥
6. ‘‘శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ధ మెత్తిహా ‘‘సమాప్తమైన’’
దంచు దెలిపి సమసితివి గదా (యెహా 19:30) ॥ఆహా॥
ప: ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపెనిను నా దోషమే గదా ॥ఆహా॥
7. ‘‘అప్పగింతు దండ్రి నీకు నాత్మ’’ నంచును గొప్ప
యార్భాటంబు చేసి కూలిపోతివా (లూకా 23:46) ॥ఆహా॥
ప: ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపెనిను నా దోషమే గదా ॥ఆహా॥