పాట `346
1. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమÄమెవరు?
ఆ ప్రేమయే తానై నిలిచి ప్రేమోక్తులనే పల్కి ప్రేమతో
బ్రాణవబెట్టి ప్రేమ నగరికి చనియె ఆ... ఆ...
॥ప్రేమా॥
2. నిశ్చలమైన ప్రేమజీవికి ఇలలో తావేది?
ప్రేమ ద్రోహులేగాని ప్రియవన చేరరువాని
చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా
॥ప్రేమా॥
3. ఎంత ఘోర పాపాత్మునినైన ప్రేమించును రారా
పాపభారవతో రారా పాదవలపై బడరా
పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్ ఆ... ఆ... ॥ప్రేమా॥
4. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యవ చేసెదవేల?
రక్షణ దినమిది యేరా తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరవ వదమారగ చేకొనువ
॥ప్రేమా॥