ప: హృదయమనెడు తలుపునొద్ద యేసునాధుండు
నిలచి సదయు డగుచు దట్టుచుండు సకల విధములను (హృ)
1. పరుని బోలి నిలచున్నాడు పరికించి చూడ
నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు (హృ)
2. కరుణాశీలుండతడు గాన గాచియున్నాడు యేసు
కరుణనెరిగి గారవింప గరము న్యాయంబు (హృ)
3. ఎంతసేపు నిలువబెట్టి యేడ్పింతు రతని నాత డెంతో
దయచే బిలుచు చున్నాడిప్పుడు మివ్మలను (హృ)
4. అతడు మిత్రుడతడు మిత్రు డఖిల పాపులకు మీర
లతని పిలుపు వింటి రేని యతడు ప్రియుడగును (హృ)
5. జాలిచేత దన హస్తముల జాపియున్నాడు మిము్మ నాలింగనము
సేయగోరి యనిశము కనిపెట్టు (హృ)
6. సాటిలేని దయగలవాడు సర్వేశుసుతుడు
తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు (హృ)
7. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాధు నతడు
చేర్చుకొనుచు మీ కిచ్చును చిరజీవము గృపను (హృ)
8. అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు
మీర లతని హత్తుకొందు రప్పు డానందముతోడ (హృ)
9. బ్రతుకు శాశ్వతంబుకాదు పరికించిచూడ గాన
బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి (హృ)