ప: కృపామయుడా... నీలోన... నివసింప జేసినందునా
ఇదిగో నాస్తుతుల సింహాసనం నీలో నివశింప జేసినందున
ఇదిగో నాస్తుతుల సింహాసనం (కృప)
1. ఏ అపాయము నాగుడారము సమీపించనీయ్యక
నా మార్గము లన్నింటిలో నీవే నా ఆశ్రయమైనందున (కృప)
2. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజో మయా
రాజవంశములో యాజకత్వము చేసెదను (కృప)
3. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు
నాపైన నిండుగా ఆత్మ వర్షము క్రుమ్మరించు (కృప)
4. ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు
నీ కృప నను విడువక శాశ్వత కృపగా మారెను (కృప)