పాట `9
ప: నా ప్రాణమా యెహోవాను కీర్తించుము
ఆయన చేసిన మేలులన్ ఎన్నడు మరువకుము
1.కరుణా ప్రేమ కిరీటమును నీ తల నిడి దీవించెను
కృపలతో జీవ జలములతో తనవానిగ అభిషేకించెను ॥నా ప్రాణమా॥
2.ఎన్నడు కోపించనివాడు జీవన దాతగు దేవుడు
శరణను వారికి రక్షకుడు తోడు నీడగా నడిపించగా ॥నా ప్రాణమా॥
3.దీర్ఘాjవుచే దీవించెను మేలులతో తృప్తిపరచెన్
దీర్ఘశాంతుని దేవదేవునిఎల్లవేళలా సన్నుతించుము ॥నా ప్రాణమా॥