పాట`137
ప:నీ జల్దరు వృక్షపు నీడలలో నే నానంద భరితుడ నైతిని
జలురక్కసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభూ
1.నా హృదయపు వాకిలి తీయుమని పలుదినములు మంచులో
నిలచితివి నీ శిరము వానకు తడిసినను
నను రక్షించుటకు వేచితివి ॥నీ॥
2. ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళవర్ణుడా
నాకతి ప్రియుడావ్యసనాక్రాంతుడుగా
మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి ॥నీ॥
3. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడు
వచ్చుచున్నాడు నా హృదయపు తలుపు తెరుచుకొని
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను ॥నీ॥
4. పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును
నింపినవి ద్రాక్షా రస ధారలకన్న మరి
నీ ప్రేమ ఎంతో అతి మధురం ॥నీ॥
5.నీ విందుశాలకు నడిపించి రాజులు, యాజకులతో చేర్చితివి
జీవాహారము నా కందించి పరమ గీతములను నేర్పితివి ॥నీ॥