పాట `83
ప: స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసి
వర్తమాన భూత భవిష్యత్కాలవాసి
అల్ప ఓమేగ తానె ఆద్యంత మన యేసే! (స్వ)
1. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల జేతున్
నీ ప్రజలందరి యెదుట పరిశోధింపజాలని
మహాపనులెల్ల ప్రభువే లెక్కలేని
యద్భుతముల్ మక్కువతో చేయువాడు ॥స్వ॥
2. సంగీత నాదములతోడ సీయోనుపురము సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా శిరవలపై వెలసెను
దుఃఖము నిట్టూర్పును పోయెన్ మిక్కిలి ఆనందము గల్గెను ॥స్వ॥
3. నీలముల పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్య
మణులతో సువర్ణశునీయముల సూర్యకాంతముతో
ప్రశస్తరత్నములతో ప్రవిమలముగ నిను గట్టెదను ॥స్వ॥
4. సుమముల హారము సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రవము నీదే ఉల్లాస వస్త్రంబు నీదే విడుదలయు నీదే
హితవత్సరము వివక్తి ఆత్మాభిషేకము నీదే ॥స్వ॥
5. జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను
నీతోడైయుండెదను నదులలో వెళ్ళునపుడు
నీపై పారవు అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నినుకాల్చగలేవు ॥స్వ॥
6. ఇత్తడి తలుపులు బగులగొట్టెద నిను పగడియలను
విడగొట్టెదను నేను అంధకార స్థలములలోనున్నట్టి నిధులను
రహస్యములో మరుగైన ధనమును నీ కొసంగెదను ॥స్వ॥
7. గర్భమున పుట్టినది వెదలు తల్లియుడిలోన
కూర్చుండినది వెదలు నేను చంక బెట్టుకొన్న నాదు ప్రజలారా!
వదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే ॥స్వ॥