పాట `43
ప: నానోటన్ క్రొత్తపాట నా యేసు ఇచ్చెను
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవితకాలమంత హల్లెలూయ...
1. పాపపు బురద నుండి లేవనెత్తెను
జీవమార్గమున నన్ను నిలువబెట్టెను ॥ఆనం॥
2. తల్లిదండ్రి బంధుమిత్ర జీవమాయెనే
నిందను భరించి ఆయన మహిమన్ చాటెదన్ ॥ఆనం॥
3. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను
కష్టవలన్ని తొలగించి శుద్ధీకరించెను ॥ఆనం॥
4. ఇహలోకశ్రమలు నన్నేమి చేయును
పరలోక జీవితమునే వాంఛించెదను ॥ఆనం॥