పాట `53
ప: రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము (2)
ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని (2)
ఆహ... హల్లెలూయ ఆహ... హల్లెలూయ (2) ॥రండి॥
1.కష్టనష్టము లెన్నున్న పొంగుసాగరమెదురైన
ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ॥రండి॥
2. విరిగి నలిగిన హృదయవతో దేవ దేవుని సన్నిధిలో
అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో ॥రండి॥
3. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాధుడని
నీతి సూర్యుండాయనేనని నిత్యమము స్తుతి చేయుదము ॥రండి॥