ప: నీధనవ నీఘనవ ప్రభు యేసుదే
నీ ధశమభాగము నీయ వెనుదీతువా వెనుదీతువా
1. ధరలోన ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి
రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరియేసు కొరకీయ
వెనుదీతువా (నీ)
2. పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు
దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును గడువేల
ప్రభుకీయనో క్రైస్తవా (నీ)
3. వెలుగునీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభునీకు
ఉచితంబుగా వెలిగించ ధరపైని ప్రభు నామము
కలిమికొలది ప్రభున కర్పింపవా (నీ)
4. కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ
భరితంబులు బలియాయె నీ పాపముల కేసుడే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా (నీ)