ప: నీ కృప నాకు చాలునయ్యా
నీ కృపలో నన్ దాచుమయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
1. అంధకారమే పెనవేసిన దారి కానక రాకున్నా
నీదు దయతో చూచావయ్యా చెయ్యిపట్టి నడిపించావయ్యా ||నీ||
2. పెను తుఫాను చెలరేగిన అలలు పైపైకి పొంగిన
లంగరువై తోడున్నావయ్యా ఆదుకొని బ్రతికించావయ్యా ||నీ||
3. నీ పాద సన్నిధి చేరి ఉన్నాను దీన మనస్సుతో వేచి ఉన్నాను
నింపుము నన్ను నీదు ఆత్మతో పరిశుద్ధ స్థలమున నిలుపుము ||నీ||