పాట `241
1. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము
మనమందరమును ఆయన సేవను ఏకమై సదా జేసెదము
ప: మనయేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును అతి వేగముగ
సేవచేతుము యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా
విశ్వాసముతో సాగెదము ॥మన॥
2. అందరి యెడల ప్రేమ జూపెదం యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగ ఉత్సాహంబుతో రాజ మార్గమును చూపెదము ॥మన॥
3. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము
ఈ లోకమంతటన్ ప్రభుయేసు నామమున్ ఎల్లవేళలందు చాటెదము ॥మన॥
4. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి ప్రభుదినమందు హర్షింతుము ॥మన॥