పాట`143
ప: ఆనందము ప్రభు నా కొసగెను
నా జీవితమే మారెను
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను
1. ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమా మూర్తి
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను ॥ఆనందము॥
2. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి
పైకి ఉప్పొంగి ఎగయుచుండె
నన్ను పిలచి ఎన్నో మేలుల జేసెన్
నూతన జీవ మొసగెన్ ॥ఆనందము॥
3. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ ॥ఆనందము॥