పాట-442
1.యెహోవా యీరే నన్ను చూసేవాడా నీవుండుట యే చాలు
యెహోవా రాఫా స్వస్థ ప్రధాతా నీ గాయమే బాగు చేయు
యెహోవా షమ్కా తోడుండువాడా నా అక్కరలన్ తీర్చుప.
నా వెంట నీవు తోడుంటె చాలు నీవుంటే చాలు నాకు
2.యెహోవా ఏ లోహిం నా సృష్టికర్తా నీ వాక్కులే ఈ సృష్టి
యెహోవా ఏల్యోన్ మహోన్నతుడా నీకు సాటి లేదెవరు
యెహోవా షాలోం శాంతి ప్రధాత నాహృదిలోనికి రమ్ము
నా వెంట నీవు తోడుంటె చాలు నీవుంటే చాలు నాకు
3.యెహోవా ఎల్షడై బహుశక్తిమంతుడా నా బలమే నీవు కదా
యెహోవా రోహి నా మంచికాపరి నీ కరుణతో కాపాడు
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా నాకు అభయము నీవే ప్రభు
నా వెంట నీవు తోడుంటె చాలు నీవుంటే చాలు నాకు