పాట`157
ప: నిత్యము నిలుచునది దేవుని వాక్యము
` సత్యమై యున్నది సర్వముచేయునది
ఆ వాక్యమె యేసు దైవము ఆదియందు
ఉన్న దైవము అంతమే లేని దైవము ॥నిత్యము॥
1.అంధకారమును తొలగించు జ్యోతి
అదిప్రతి మనిషిని వెలిగించు మహిమ
వెలుగు అదివెలిగించును నడిపించును
త్రోవకు దీపమై (2) ఆ వెలుగు వాక్యము ॥ఆ వాక్యమే॥
2. ఎండిన యెడారిలో నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు జీవనదియే అది
దప్పిగొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది (2)
ఆ జీవ వాక్యము ॥ఆ వాక్యమే॥
3. అపవాదిని అణచివేసే ఆత్మఖడ్గమది
రెండంచుల వాడిగలదై వధించును వైరులను
ఓడిరచును విడిపించును తోడై ఎల్లప్పుడు(2)
ఆ శక్తిగల వాక్యము ॥ఆవాక్యమే॥
4. పోరాడుము యేసుకై మంచి సైనికునిగా
శ్రమలను భరించుము వాక్యములో
బలమొందితన ఐశ్వర్యములో తీర్చును
నీ ప్రతి అవసరము (2) ఆ దేవాది దేవుడు ॥ఆవాక్యమే॥
5. నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు
జయించు వారినెల్ల తనతో కొనిపోవును
తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవై యుండుము (2)
ప్రభు కొరకై కనిపెట్టుము హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)