ప: వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ,
శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో
1. ఇన్నినాళ్ళు ధరను మము్మ బ్రోచియు గన్న తండ్రి మించి
యెపుడు గాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా యన్ని
రెట్లు స్తోత్రము లివిగో (వంద)
2. పాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మము్మ
గావుము నూతనాబ్ధమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు
నాధ రక్షకా (వంద)
3. దేవ మాదు కాలుసేతులెల్లను సేవకాళి తనువు దినము
లన్నియు నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవకై
యంగీకరించుమా (వంద)
4. కోత కొరకు దాస జనముపుము ఈదరి మాలోటు పాట్లు
దీర్చుము పాతకంబులెల్ల బాపి భీతి బాపుము ఖ్యాతి నొందు
నీతిసూర్యుడా (వంద)
5. క్రీస్తు సంఘమును పెద్దజేసి పెంచుము నీ సువార్త చెప్ప శక్తి
నీయుమువ మోసపుచ్చు నంధకార మంత ద్రోయము యేసు
కృపన్ గ్రుమ్మరించుము (వంద)