పాట `259
ప: కొండ కోన పల్లెలందు పాడుదాం
ఎండవాన తల్లడిల్లి ఆడుదాం (2)
అరెపోదాం మారువూల కోన
అరె లేరా యేసు చాటరా (2)
ఓ అక్కో అన్నో యేసు నవ్మకో (2)
1. యాతం తొక్కి తొక్కి అలసిపోతివా
తిండికి గింజ లేదని చింతపడితివా (2)
కానాను విందులోన కన్నుల పండుగ
అందురొట్టె విరిచినాడె అందువేల కెట్టినాడే (2)
కనుక ఈ బాధలేలరా (2) ॥కొ॥
2. వాతం మగ్గి మగ్గి పడక పడితివా
బుల్లికి జ్వరవందని చింతపడితివా
పెద్ద రోగవెచ్చినా మల్లి బాగుపడునులే
యేసు చెంగువట్టినా అమ్మ బాగుపడునులే (2)
వినవోయ్ నీకు బాధలుండవు ॥కొ॥