పాట `322
ప: సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులుచేయు తరుణమిదే
1. లేలెమ్ము సోదరుడా నిద్రనుండి ప్రకటించను
యేసు నామమును సోమరియేల నిద్రించెదవు
ఈ ధరను లేపెడు సమయమిదే ॥సి॥
2. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము
కట్టి తయ్యారగుమా సోదరుడా ప్రతివీధికి వెళ్ళి
సువార్తను చాటెడు సమయమిదే ॥సి॥
3. లోక రక్షణకై ప్రభుయేసు దీక్షతో నరుదెంచెను
ఈ ధరకు వెలుగును మనకిచ్చెను యేసు తన
స్తుతులను పాడెడు సమయమిదె ॥సి॥
4. పాతాళమునకు కొనిపోయెడి నీ పాత నిద్రను
విడనాడుమిక సిలువ మర్మఉ నెరుగుమిపుడే కునికెడు
సమయము కాదిది ప్రియుడా ॥సి॥
5. రక్షింపబడుట కాశించినచో పశ్చాత్తాపపడు
మీ దినమే కలుషాత్ముండా తడవేలనికన్
కనుమా నీ తీర్పు తరుణమిదే ॥సి॥