పాట -455
ప.నోరారగా చేతును దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2
1.భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో ||హల్లెలూయా||
2.తొలగించితివి పాప శిక్షనుండి
నడిపించితివి జీవ మార్గము నందు ||హల్లెలూయా||
3.దయచేసితివి మోక్షభాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై ||హల్లెలూయా||