పాట`123
1. ప్రియుడైన నాదుయేసు నా సర్వమాయన్
పదివేల మంది కన్న శ్రేష్టుడు
క్రీస్తు లోయలోని లిల్లీ సమస్తమాయనే
నా ఆత్మకెప్పుడు ప్రాణ ప్రాణనాధుడు
దుఖ:ంబులోన వెరవన్ శ్రమలందు సంతోషం
నా చింత లెల్లన్ తాను మోయును
ప: క్రీస్తు లోయలోని లిల్లీ ప్రభువు వేకువచుక్క
పదివేల మంది కన్న శ్రేష్టుడు
2. నా సంకటములు తీర్చ మన భారమంతయు
ప్రేమలో మోసి ప్రాణమిచ్చెను
నే ఎన్నడైనన సహింతున్ నా ప్రియ యేసుకై
నన్ను ఎన్నడును చేయి విడువడుఆవని
అణగద్రొక్కి నన్ను సాతాన్ శోధించిన
క్రీస్తు యేసు నాకు జయము నొసగున్
3. ప్రభు యేసు చిత్తమునకు విధేయుడై
సర్వ బాధలెల్ల ఓర్చి నిలచెదన్
ప్రభు స్వాంతమైతే భయమేలనాకిలన్
ఏసు కాంతి ముఖము చూడ చిరునవ్వు
మారని మోక్ష నగర వడిగ నే చేరెదన్