పాట -454
ప. ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో
పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణామయా అందుకో (2)
ఆరాధనాలందుకో
అ.ప: ఘనత మహిమ నీకేయని హల్లెలూయ గానము చేసేదను
1.అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవా మోషేతో అన్నావు ఉన్నావని (2)
అల్ఫయు నీవే ఓమేగయును (2) ఆద్యంత రహితుడ నీవేనని ||ఘనత||
2.పాపంబున జన్మించి నశియించితిని లోకంబు నాదనుచు ఆశించితిని
అయినా నీవు రక్షణ నివ్వ ప్రేమించి పంపితివి యేసుప్రభుని ||ఘనత||
3.తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వశక్తిగల ప్రభువనియు
రానున్నావు మరల నాకై ఆనంద దేశములో నన్నుంచుటకై ||ఘనత||