పాట `218
ప: కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిధారీ
జిగటమన్నైన నా వంక చల్లగ జూడుమయ్యా !
1.లేఖనమందలి పాత్రలు ప్రభుని స్తుతించగ
అట్టి స్తుతించుపాత్రగా నన్ను మార్చి కాపుమయ్యా ॥కు॥
2. పనికిరాని పాత్రనని పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా నింపు మెల్లప్పుడు ॥కు॥
3.సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండ
సాక్షిగా నుండు పాత్రగా సత్యముతో నింపుము తండ్రీ! ॥కు॥
4.వెలగాని పాత్రగా నున్న నన్ను కొనువారు లేెరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో విలువొందు పాత్రగ జేయుము ॥కు॥