పాట `207
ప: గొప్ప సాక్షి సముహం ఆవరించె
మనపై ` మేఘంలా అనురాగంలా
1. తనయుని బలినీయ వెనుకాడని విశ్వాసం
రాజ్యాశాలేని స్వజనతా ఆవేశం ॥గొప్ప సాక్షి ॥
2. హనోకేలియులు దేవుని కిష్టులయే
మరణం చూడకయే కొనిపోబడే పరమునకు ॥గొప్ప సాక్షి ॥
3. బాధల హింసలలో బంధకాల ఖడ్గములో
పరలోకము కొరకు పడిరెందరో పలుశ్రమలు ॥గొప్ప సాక్షి ॥
4. పాపమును విడిచి ప్రతి భారమును మరచి
యేసుని వైపు జూచి పరుగిడుదాం పందెమున ॥గొప్ప సాక్షి ॥