పాట`228
ప: క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి క్రీస్తే అసిల్వధారి
1. ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత పరంబు వీడెగాన ॥క్రీస్తే॥
2. దివ్య పధంబురోసి దైవంబు తోడు బాసి
దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ॥క్రీస్తే॥
3. శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
శాపభారంబు మోసి శ్రమల సహించెగాన ॥క్రీస్తే॥
4. సైతాను జనము గూల్ఫన్ పాతాళమునకు బంపన్
నీతి పధంబు బెంప రుధిరంబు గార్చెగాన ॥క్రీస్తే॥
5. మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్
మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన ॥క్రీస్తే॥
6. పరమందు దివిజులైన ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ॥క్రీస్తే॥
7. ఈ నామమునకు మించు నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన ॥క్రీస్తే॥