పాట `242
ప: క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినపుడు
మధు స్వరమేయది మెల్లని స్వరమే యది
1. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను ॥క్రీస్తు॥
2. బలమైన నీ స్వరము బహుప్రభావము గలది
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని ॥క్రీస్తు॥
3. అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును
ఆకుల రాలజేయును వేళ్ళ నీనజేయును ॥క్రీస్తు॥
4. ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్
ఆశీర్వాదము శాంతి నొసగు నాయన స్వరమే ॥క్రీస్తు॥
5. నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను ॥క్రీస్తు॥
6. నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను ॥క్రీస్తు॥
7. నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును ॥క్రీస్తు॥
8. తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము ॥క్రీస్తు॥
9. మరణాంధకార లోయలో నేనుండ
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ ॥క్రీస్తు॥
10. ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్
దీనుడనై నీ మాట అంగీకరించెదను ॥క్రీస్తు॥