పాట `237
ప: విన్నావా విన్నావా ఈ వార్తను
ఎన్నడైన పొందావా ఈ ప్రేమను
ప్రభు యేసు ప్రేమించెను `
నీకై తన ప్రాణమిచ్చెను (2)
నేనే మార్గం, సత్యం, జీవం అని `
నేను తప్ప వేరే దేవుడు లేడని
చెప్పిన ఆ దైవమే ఈ భువికి `
శరీరుడై నీకై దిగి వచ్చెను
నిత్య ప్రేమను నీకు చూపుటకై
నిత్య జీవమును నీకు ఇచ్చుటకై
నిను చేరవచ్చెను `
నీకై తన ప్రాణమిచ్చెను
నీ జీవం, నీ ప్రాణం, ఏ పాటిది `
సృష్ట్టి కర్తను నీవు స్మరియించుమా
పాపివని నీవు గ్రహియించుమా `
సిలువను నీవు తేరి చూడుమా
తన చేతులలో నీవు ఉన్నావని `
నీ జీవము తనలో దాయబడెనని
వాగ్ధానమే ఇచ్చెను `
నీకై తన ప్రాణమిచ్చెను
ఈ దినమే ఈ క్షణమే రమ్ము నీవు `
అంగీకరించుము క్రీస్తు ప్రేమను
చాచియున్న చేతులలో రక్తధారలు `
ఆ రక్తమే నిను శుద్ధీకరించును
నీ సృష్టికర్తను నీవు చేరుమా `
నీ రక్షణకర్తను నీవు సేవించుమా
తన సొత్తు నీవనెను `
నీకై తన ప్రాణమిచ్చెను