పాట`141
1.యేసు నీనామం ఉన్నతమైనది దేవా నీ వాక్యం జీవముగలది
ప్రభువా నీ సన్నిధి పవిత్రమైనది కీర్తించి నిన్నే ఆరాధించెదన్
హల్లెలూయా ప్రభు హల్లెలూయా॥2॥ హల్లెలూయా నీకే హల్లెలూయా
2.నీ ప్రేమ నాపై సాటిలేనిది నా పాపములన్నిటి బాపివేయున్
నీ కృపతో నను దాచితివి కల్వరి ధారలో ॥2॥హ॥
3.నీ రక్తము పరిశుద్ధమైనది నా శాపములన్నిటి తీసివేయున్
నను కడిగి పవిత్రున్ జేయు కల్వరి బలియాగము ॥2॥హ॥
సిస్టర్. సునీత కొమానపలి