1. ఏదేన్ వనంబునందు అది వివాహమున్
విధించినట్టి వాక్కు వర్థిల్లునిప్పుడున్
2. పవిత్ర కళ్యాణంబున్ పదిలపర్చుచు
దైవత్రిత్వంబు నేడున్ దీవింప వత్తురు
3. సంతాన వరమును సంతోష ప్రేమయు
వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు
4. ఆదామునకు దండ్రీ హవ్వ నొసంగితివి
వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము
5. నీ రెక్క క్రింద వీరి బరిగ్రహించుచు
నైరి తంత్రంబు నుండి దూరంబు జేయుము