పాట - 456
ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు
నీ స్థానము విడిచి దిగివచ్చిన యేసు
ప:ప: నీకే ఆరాధన నీకే నా స్తోత్రము (2)
నీకే ఆరాధన నీకే నా స్తోత్రము (2
2.మహిమ కిరీటమును మేము ధరించుటకై
ముళ్ళ కిరీటమును నీవు ధరించితివె
నీకే ఆరాధన నీకే నా స్తోత్రము (2)
3.పరిశుద్ధులుగాను మమ్మును ఉంచుటకై
పాపిగా మా కొరకై ఎంచబడితివయ్య
నీకే ఆరాధన నీకే నా స్తోత్రము (2)
4.ఆశీర్వాదముతో మమ్మును నింపుటకు
శాపములన్నిటిని భుజముపై మోసితివా
నీకే ఆరాధన నీకే నా స్తోత్రము (2)