పాట `6
ప: ఏ హేతువు లేకయే నన్ను ప్రేమించితివి యేసయ్యా
ఏ యోగ్యత లేకయే నను కనుగొంటివి యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా నా మంచి మిత్రుడా యేసయ్యా
1. గలలీయురాలను బలహీనురాలను పాపములోనే జన్మించితిని(2)
పాపములోనే జీవించితిని (2) వెలివేయబడితిని వెలలేకయుంటి (2)
ఏ కారణం లేకయే నను చేరితివి యేసయ్యా
ఏ హద్దులు లేకయే నను కోరితివి యేసయ్యా ॥యేసయ్యా॥
2. నిరీక్షణ లేకను రక్షణలేకను శాపగ్రస్తనై జీవించితిని (2)
ప్రయాస మంతయు తీర్చితివిగా (2) ధన్య జీవిగా మార్చితివిగా (2)
నీ రూపము నా కొసగి సిలువలో బలిjైుతివి
నీ నీతి గల దానివై(వాడవై)జీవింప కృపనిమ్మయా(2) ॥యేసయ్యా॥