పాట `281
ప:యజమానుడు వాడుకొనుటకు
అర్హమైన పాత్రగా ఉండుటకు
జీవితాంతం పోరాడు ` అలసిపోకు ఏనాడు
1.గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ` బంగారు పాత్రలు
మట్టి పాత్రలు ` కర్ర పాత్రలు
ఘనతకు కొన్ని ` ఘనహీనతకు కొన్ని
వీటిలో చేరని నాడు `
పవిత్రముగా జీవించిన నాడు
పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు
అర్హమైన పాత్రవగుధువు
జీవితాంతం పోరాడు ` అలసిపోకు ఏనాడు ॥యజమానుడు॥
2.యవ్వనేచ్ఛలను వీడుము ` యేసు ప్రభుని వేడుము
నీతిని విశ్వాసమును ` ప్రేమను సమాధానమును
వెంటాడుము శోధించుము సాధించుము ॥యజమానుడు॥