పాట`145
ప: నమ్మదగినవాడా స్నేహితుడా
నమ్మదగినవాడా నా సహాయకుడా
నీయందే ఆనందం నీయందే సంతోషం
నీయందే నిత్యజీవము (2) హల్లెలూయా
(3) నీకే స్తోత్రం
1.ఆదుకొనేవాడవు నీవేలే నన్ను
కాచే నాదేవుడవేనీ మహిమను
చూపుమయ్యా దేవానా రక్షణ నీవేనయ్యా
నా కేడేము శైలము నీవేనయ్యా ॥నమ్మ॥
2. ఆది అంతము నీవే నాదేవా
నా పాలిట కరుణమూర్తి నీవయ్యా
నన్ను కావగా నా ప్రభువా నీవే
ఆ శిలువను మోసితివా (2)
నా తల్లివి, తండ్రివి నీవేనయ్యా ॥నమ్మ॥