పాట `386
ప: హోసన్ననుచూ, స్తుతిపాడుచూ సీయోనుకు
వెళ్ళెదం (2) హోసన్నా హోసన్నా (4)
1. ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన ధరణిలో
పరదేశులం క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయనగరం మనకు శాశ్వతం ॥హోసన్న॥
2. మన్నైన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రవలు
ఇలధరించెను నాధుడేసుకు నవవధువులం నీతిపాలనలో
jవరాజులం ॥హోసన్న॥
3. ప్రతిభాష్ప బిందువును తుడిచివేjను చింతలన్ని తీర్చి
చెంతనిల్చును ఆకలి లేదూ దప్పికలేదూ ఆహా!
మనయేసులో నిత్యానందం ॥హోసన్న॥