పాట `349
1. ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను అంతటా జాటించుడి
హల్లెలూయ హల్లెలూయ ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనును నటంచు బ్రకటించుడి
(హల్లె)
2. మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానవ
నెంత పాపికైన దానిచ్చి చేర్చుకొనును (హల్లె)
3. తన దివ్య సిల్వచే దీసి పాప శాపవన్
నన్ బవిత్ర పర్చెను నాకు హాంనిచ్చెను
(హల్లె)
4. ఘోర పాపినైనను నన్ను జేర్చుకొనును
పూర్ణ శుద్ది నిచ్చును స్వర్గమందు జేర్చును
(హల్లె)