పాట-292
ప.జన్మించె ఇలయేసు బెత్లెహేము పురమున
సంగీత సునాదములు వినిపించె ఆర్భాటముతో
ఉ.ప: ''పరిశుద్ధుడు పరమాత్ముడు పరలోక వాసి
సర్వోన్నతా స్థలములలో దేవునికే మహిమ'
1.దూతగణం పాడింది యేసుని జననం తెలిపింది
మహిమ ఘనత చెల్లించి ప్రభు రక్షకుడని ప్రకటించిరి
సంతోషవార్తను చాటిరి గొల్లలకు మనకొరకు పుట్టినాడు యేసయ్యా ||ప||
2.ఆకాశ గగనాన తార వెలసింది
జ్ఞానులకు తెలిపెను రారాజు జన్మించెనని
సంతసించుచు సృష్టి ప్రకటించెను
ఆనంద భరితులై జ్ఞానులు వెడలిరి
సాగిలపడి బంగారు సాంబ్రాణి భోళములతో ఆరాధించిరి ||ప||
3.సర్వ మానవాళి కొరకై కేతెంచెన్
మన రక్షకుడై ప్రభు యేసు పాపపు క్రయధనం చెల్లించుటకై
దేవుని గొఱ్ఱెపిల్లగ బలియాయెన్
విజయముతో మరణపు ముళ్ళను విరచెన్
నీకై నాకై నిత్య జీవము నివ్వన్ ||ప||