ప: నీవు చేసిన ఉపకారమువలకు నేనేమి చెల్లింతును ఏడాది
దూడలనా వేలాది పొట్టేళ్ళనా! (2)
1. వేలాది నదులంత విస్తార తైలం, నీకిచ్చినా చాలునా?
గర్భఫలమైనా నాజ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా? (2) (ఏడా)
2. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో
కరుణజూపి నీజీవ మార్గాన నడిపించువూ యేసయ్యా (2 (ఏడా)
3. విరిగి నలిగిన బలియాగముగను, నాహృదయమర్పింతును
రక్షణపాత్రను చేబూని నిత్యము నిను వెంబడిరచెదను (ఏడా)