పాట`313
ప: ఏ పాపమెరుగని యోపావనామూర్తి
పాపవిమోచ కుండా నా పాలిదైవమా
నా పాపముల కొరకీ పాట్లునొందినావా
ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై
జెల్లాటమున మొత్తిరా ముళ్ళపోట్లకు
శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివ రక్షకా
॥ఏ పాప॥
కలువరిగిరిదనుక సిలువమోయలేక
కలవరము నొందినావా సిలువ నీతో
మోయ తులువలు వేరొకని దోడుగా నిచ్చినారా
॥ఏ పాప॥
చెడుగు యూదులు బెట్టు పడరాని
పాట్లకు సుడివడి నడచినావాకడకు
కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునదించినావా
॥ఏ పాప॥
ఆకాల కర్ములు భీకరంబుగనిన్ను
ఆ కొయ్యపై నుంచిరా ఏ కాలుసేతులు
ఆ కొయ్యకేసూది మేకులతో గ్రుచ్చినారా
॥ఏ పాప॥
పలువిధంబుల శ్రమలు చెలరేగ దండ్రికి నెలుగెత్తి
మొరలిడితివా సిలువపై బలుమారు
కలుగు చుండెడి బాధ వలన దాహము నాయెనా
॥ఏ పాప॥
బల్లిదుండగు బంటు బల్లెమున
నీ ప్రక్క జిల్లిబడ బొడిచినాడా
ఉల్లోలములవలె నల్లనీరుబు
కంగ జల్లారెగద కోపము
॥ఏ పాప॥
కటకటా పాపసంకటము బాపుటకింత
పటుబాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ ఎటువంటిదీశాంత
మెటులవర్ణింతు స్వామి
॥ఏ పాప॥
ప:సిలువచెంత చేరినాడు
కలుషవలను కడిగివేj
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తుల జూచి