పాట `64
ప: దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ॥దేవు॥
2. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ॥దేవు॥
3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ॥దేవు॥
4. ప్రభువు గొప్పవాడును అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ॥దేవు॥
5. దీనులకు అండాయనే భక్తిహీనుల గూల్చును
సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడి ॥దేవు॥
6. ఆయన ఆకాశము మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము సిద్ధపర్చువాడని ॥దేవు॥
7. పర్వతములలో గడ్డిని పశువులకు వెలిపించును
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ॥దేవు॥
8. గుఱ్ఱముల నరులందలి బలము నానందించడు
కృపకు వేడువారిలో సంతసించువాడని ॥దేవు॥
9. యెరుషలేమ యెహోవాను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ॥దేవు॥
10. పిల్లల నాశీర్వదించియు బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును ॥దేవు॥
11. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగమును దేవుని వాక్యము పరుగెత్తును ॥దేవు॥
12. వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని
ఏ జనము కీలాగున చేసియుండలేదని ॥దేవు॥