పాట `89
ప: సాగిలపడి వ్రెక్కెదము సత్యముతో
ఆత్మలో మన ప్రభు యేసుని ఆ ఆ ఆ ॥సాగి॥
1. మోషేకంటె శ్రేష్ఠుడు అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రూక్కెదము ॥సాగి॥
2. అహరోనుకంటె శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు
ఆయనె ప్రధాన యాజకుడు అందరము మ్రూక్కెదము ॥సాగి॥
3. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయము గ తానే యుండెన్
ఆలయము మీరెయనెను ఎల్ల కాలముమ్రూక్కెదము ॥సాగి॥
4. యోనాకంటె శ్రేష్ఠుడు ప్రాణ దానముగ తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రూక్కెదము ॥సాగి॥
5. సొలోమోనుకన్న శ్రేష్ఠుడు సర్వ జ్ఞానము నకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు పదిలముగా మ్రూక్కెదము ॥సాగి॥
6. రాజులకంటె శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను జేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ రయము గను మ్రూ క్కెదము ॥సాగి॥
7. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు అనుదినము వ్రెక్కెదము