పాట `48
ప: రాజా రాజా యేసు రాజా నిన్నె మేము కొలుతుమయ్యా (2)
నీవే నీవే నా ఆరాధనా నీవే నీవే నా ఆలాపనా
నా ఉచ్వాస నిచ్వాస నీవే యేసయ్యా (రాజా)
1. యుద్ధమందునా నాకు విజయమైతివి చీకటిలోనా నాకు
వెలుగు వైతివి (2) బంధమందునా నాకు విడుదల
వైౖతివి ఆపదలోనా నాకు ఆశ్రయమైతివి అన్ని వేళలందు
నాకు తల్లివైతివి కన్న తండ్రి నీవే మాకు సొంతమైతివి(2)
2. పాపము బాపి పరిశుద్ధత నిచ్చితివి శాపము విడచి
నాశీర్వాదము నిచ్చితివి అరచేతిలో నన్ను చెక్కుకుంటివి
గుండె చెదరగా నన్ను బాగు చేసితివి అన్నివేళలందు నాకు తల్లివైతివి
కన్నతండ్రి నీవే మాకు సొంతమైతివి (2)