పాట `104
పల్లవి: నీకృపను గూర్చి నే పాడెదా`నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా(2)
నిత్యము నే పాడెదా ` నా ప్రభుని కొనియాడెదా (2)
1. ఇరుకులో ఇబ్బందిలో ` ఇమ్మానుయేలుగా (2)
నిందలో అపనిందలో ` నాకు తోడు నీడగా (2)
నా యేసు నాకుండగా ` నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా ` మనసా నీకేలా (2) ॥నీకృపను॥
2. వాక్యమై వాగ్దానమై ` నా కొరకే ఉదంంచినా (2)
మరణమై బలియాగమై ` నన్ను విడిపించినా (2)
నా యేసు నాకుండగా ` నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా ` మనసా నీకేలా (2 ॥నీకృపను॥
3. మార్గమై నా గమ్యమై ` నన్ను నడిపించినా (2)
ఓర్పుయు ఓదార్పుయు ` నన్నాదరించినా (2)
నా యేసు నాకుండగా ` నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా ` మనసా నీకేలా (2) ॥నీకృపను॥