పాట`318
ప: దేవ దూతల భాషలతో నేను మాట్లాడిన మాట్లాడిన ప్రవచించు
వరంబు నాకున్నను ప్రేమలేని వాడనైతే వట్టివాడను
ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇదే ॥ఇ॥
1. కొండలను నేను పెకిలించిన బండలను బద్ధలుగ చేసినను
ఆకాశం పైకి ఎగిరిపోయినను ప్రేమలేని వాడనైతే వట్టివాడనే ॥ఇ॥
2. పేరుకు మాత్రము క్రైస్తవుడా ఊరకనె చేరవు యెరుషలేము ఓర్పు
సహనంబుక్షమాపణంబు లేక ప్రేమలేని వాడనైతే వట్టివాడనే ॥ఇ॥
ఎంత విద్యనభ్యసించిన ఎంత ఔన్నత్యంబునకు పోయిననూ గొప్పపదవులలో నేను తిరిగినను ప్రేమలేని వాడనైతే వట్టివాడనే ॥ఇ॥
4. లోకమంతయు నాకుండిన కొదువలేమియు నాకు లేకుండిన
అందరిని మించు అందంబు నాకుండిన ప్రేమలేని వాడనైతే వట్టివాడనే ॥ఇ॥