పాట `205
ప: ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా
నీ వాక్కుకై వేచి యుంటిని నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా ॥ఎన్ని॥
1.నా ఇంటి దీపం నీవే అని తలచి
నా హృదయం నీ కొరకైపదిలపరచితి
ఆరిపోంన నా వెలుగు దీపము
వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా ॥ఎన్ని॥
2.ఆపదలు నన్ను వెన్నంటిఉన్నా
నా కాపరి నీవై ననుఆదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరుచేయవు ప్రభువా ॥ఎన్ని॥