పాట `82
ప: నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యవగా
1.అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్యసమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా
మహిమరాజా స్తుతింంచెదన్ ॥నా॥
2.విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నేపాడెదను నాప్రభువా ॥నా॥
3.గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరుచునా
మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణరాజా ॥నా॥
4. రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహరవన్
రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ॥నా॥
5. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞత స్తుతుల తోడ నీ ప్రేమను నే వివరింతును విమోచక ॥నా॥
6. వాగ్ధానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ ॥నా॥