పాట`227
ప: నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననె
1. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగె
సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే ॥నీ॥
2. తప్పిపోతిని గతమందు తప్పుదారిని నడచితివి
తన ప్రేమాహస్తమే నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు వింతైన తన ప్రేమన్ ॥నీ॥
3. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని
ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమియించె
నీ యుల్లము ఆయన కాలయమే జ్ఞాపకముంచుకొనుము ॥నీ॥
4. యెవరతని సేవించెదరో ఫలమొందెదరంత మందు
ఇతరులకు లేనట్టే ఆ ఘనతను నీ కిచ్చె
కృతజ్ఞడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని ॥నీ॥