.పాట-112
సర్వోన్నత స్థలములో సమాధానకర్తవు
సత్య స్వరూపాత్మతో స్తుతించి స్తోత్రింతుము
1.నిన్న నేడు నిరంతరం, వున్న నిర్మల రాజా
నీ ఆలోచన చేత నిత్య నరకము నుండి
నిత్యజీవ రాజ్యమునకు నన్నుపిలచితివయ్యా
2.జీవఫలము నా కొరకు జీవ జలముల వరకు
జీవ కిరీటము నాకై జీవ గ్రంథతమముకై
జ్యేష్టుల సంఘమునకు జీవము నిచ్చితివా
3.సిలువ రక్తము ద్వారా శత్రువునైన నాకు
శాంతి సమాధానమును సంతస జీవితమును
సాత్వికుడైన దేవా నీకు సాగిల పడిదెం