పాట -308
ప:సర్వోన్నతుడా, సర్వేశ్వరుడా, సంపూర్ణుడా సత్యస్వరూపి
సర్వమానవాళి కొరకై సత్యసువార్త ప్రకటించి
సర్వోన్నత స్థలములో మనలను చేర్చుకొనుటకు
దివి నుంచి వచ్చిన మా యేసయ్యా
ప:ఆహ ఆనందమే పరమ సంతోషమే నా యేసు నాకై పుట్టెన్
1.పరలోక దూతలు ఇహలోక నరులకు ప్రకటించిరి మహ సంతోష శుభ వార్తను
రానున్న యేసయ్యా మన మేసయ్యని మా ఇమ్మాయేలు దేవుడువని
గళమెత్తి ఆరాధింతుము
2.రాజ భవనం కాదురా జనియించిన మన రాజు
పశువుల పాకరా ఆ దైవ కుమారుడు వెలసినది
బంగారు ఉయ్యాల కాదురా పరుండినది
పశువుల తొట్టిరా రక్షకుడు నిదురించెను
3.పట్టు వస్త్రములు కాదురా ధరియించెను ఆ దైవం
పొత్తి గుడ్డలతో చుట్టబడెను ప్రియ యేసు
రాజకుమారుడిగా కాదురా ఆ ప్రభు పయనము
యూదుల రాజుగా సాగింది ఆ సిలువ త్యాగము