.పాట-111
ప.నా సుందర రక్షకా ప్రాణ ప్రియుడా నా యేసురాజా
నిన్నే ప్రణుతింతును నిన్నే సన్నుతింతును
నా జీవితమంతా నీవేనాయ్యా
ఉ.ప.ఆరాధన ఆరాధనా ధవళవర్ణుడా రత్నవర్ణుడా
నీకే నా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా
1.రక్త సిక్తమాయె నీ సుందర మోము
శీలలతో గృచ్ఛబడే నీ కరుణా హస్తం
నదివలె కారెను నీ పరిశుద్ధ రక్తం
ఎంత ప్రేమ నా పైన నా ప్రియుడా నా ప్రియుడా
2.మరణం జయించె నా ప్రియ యేసు
సజీవుడా నా రాజా నా దేవా
ఆదరణ ఇచ్చితివి పరిశుద్ధ ఆత్మతో
కౌగిటిలో చేర్చుకొనెను నా ప్రియుడా నా ప్రియుడా
3.బహుమానాలెన్నో సిద్ధపరిచె నా ప్రియుడు
పరిశుద్ధ స్థలములో తన చెంత
వేచి యుండే నా హృదయ వాకిట
ఎంతకాలం నాకొరకై నాప్రియుడా నా ప్రియుడా